(తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో)
- డా. గన్నవరపు నరసింహమూర్తి
హృదయ వైఫల్యమంటే గుండె నిర్మాణములో లోపాలు గాని, హృదయవ్యాపార ప్రక్రియలో
లోపముల వలన కాని గుండె వివిధ అవయవాలకు అవసరమయిన రక్తము నందించలేక పోవుట.
అకస్మాత్తుగా గుండె ఆగిపోవుట, లేక గుండెపోటు అని కాని అపార్థము
చేసుకోకూడదు. హృదయవైఫల్యము సాధారణముగా క్రమేపి ముదిరే దీర్ఘకాలిక వ్యాధి.
గుండెపోటు వంటి కారణముల వలన హృదయవైఫల్యము త్వరితముగా పొడచూప వచ్చును.
హృదయవైఫల్యమునకు గురి అయిన వారు ప్రపంచములో సుమారు నాలుగుకోట్లమంది ఉంటారు.
అరవై యైదు సంవత్సరాలకు పై బడిన వారిలో ఐదు నుంచి పది శాతము మంది దీనికి గురి
అవుతారు.
కారణాలు :
హృదయరక్తనాళముల కాఠిన్యత, హృదయరక్తప్రసరణ లోపము, రక్తపుపోటు, మధుమేహవ్యాధి, రుమేటిక్ గుండెజబ్బు వలన కలిగే హృదయకవాటవ్యాధులు, సారాయి, కొకైన్, మిథాంఫిటమిన్ వంటి మాదకద్రవ్యములు, విషపదార్థములు, కొన్ని ఔషధములు, విషజీవాంశువులు, సూక్ష్మాంగజీవులు, స్వయంప్రహరణవ్యాధుల (autoimmune diseases) వలన హృదయకండరములో కలిగే బలహీనత, తాపములు, హృదయకండరములలో యితర పదార్థములు పేరుకొనుట వలన కలిగే బలహీనత హృదయవైఫల్యమును కలిగించగలవు.
గళగ్రంథి ఆధిక్యత (hyperthyroidism),, ధమనులు సిరల మధ్య సంధీకరణముల
(arteriovenous fistulas), బెరిబెరి, పేజెట్స్ వ్యాధి (Paget ‘ disease) వంటి అధికప్రసరణవ్యాధులు (high output failure) హృత్కోశ ఆకుంచనము (pericardial constriction), కర్ణికాప్రకంపనము
(atrial fibrillation) హృదయవైఫల్యమును కలగిస్తాయి .
హృదయరక్తప్రసరణ లోపాలు, రక్తపు పోటు, హృదయకవాట వ్యాధులు వీనిలో ముఖ్యమైనవి. ఇవి అధికశాతపు మందిలో హృదయవైఫల్యమును కలిగిస్తాయి.

వ్యాధిప్రక్రియ (pathophysiology) :
హృదయము రక్తప్రసరణమునకు సహాయపడే ముఖ్యమైన తోడు యంత్రము. శరీరములో
యితరకండరములు సిరల నుంచి రక్తమును గుండెకు చేర్చుటకు కొంత తోడ్పడుతాయి.
హృదయకండరముల ముకుళిత (systole) వికాసముల (diastole) వలన రక్తప్రసరణ జరుగుతుంది.
హృదయములో నాలుగు అరలుంటాయి. పై గదులు కుడి ఎడమ కర్ణికలు (atria). క్రింది అరలు
కుడి ఎడమ జఠరికలు (ventricles) . కుడి కర్ణికకు దేహము నుంచి రక్తము బృహత్ సిరల
ద్వారా చేరుతుంది. కుడి కర్ణిక నుంచి రక్తము త్రిపత్ర కవాటము (tricuspid valve)
ద్వారా కుడి జఠరికకు చేరుతుంది. కుడి కర్ణిక నుంచి పుపుస కవాటము (pulmonary valve),
పుపుస ధమనుల (pulmonary artery) ద్వారా ఊపిరితిత్తులకు చేరి అచట ప్రాణవాయువుని
గ్రహించుకొని బొగ్గుపులుసు వాయువుని విసర్జించుకొని పుపుస సిరల (pulmonary veins)
ద్వారా రక్తము ఎడమ కర్ణికకు చేరుతుంది. ఎడమ కర్ణిక నుంచి ద్విపత్ర కవాటము (bicuspid
valve) ద్వారా ఎడమ జఠరికకు, ఎడమ జఠరిక ముకుళించుకొన్నపుడు బృహద్ధమని కవాటము (aortic
valve) ద్వారా బృహద్ధమనికి (aorta), దాని ద్వారా వివిధావయవాలకు రక్తము చేరి
కణజాలమునకు ప్రాణవాయువును పోషకపదార్థములను చేర్చి కణజాలము నుంచి బొగ్గుపులుసు
వాయువును వ్యర్థపదార్థములను గ్రహిస్తుంది. వ్యర్థపదార్థములను విచ్ఛిన్నము చేయుటకు
విసర్జించుటకు కాలేయము, మూత్రపిండములు తోడ్పడుతాయి.
కర్ణికలు ముకుళించుకొన్నపుడు జఠరికలు వికసించుకొని రక్తమును
గ్రహించుకుంటాయి. జఠరికలు ముకుళించుకొన్నపుడు కర్ణిక జఠరికల మధ్య కవాటములు
మూసుకొని రక్త తిరోగమనమును నిరోధిస్తాయి. రక్తము అపుడు పుపుస ధమని బృహద్ధమనులకు
నెట్టబడుతుంది.
హృదయకండరములు బలహీనమయినా, హృదయముపై అధికప్రసరణ భారము కలిగినా దేహమునకు
తగినంత రక్తమును హృదయము ప్రసరించలేనవ్పుడు హృదయ వైఫల్యము కలుగుతుంది. అప్పుడు
దానిని అధిగమించుటకు శరీరములో ఇతర పరిణామములు కలుగుతాయి. హృదయనిర్మాణములో అవాంఛిత
పరిణామములు జరుగుతాయి. హృదయకండరములో ఉబ్బుదల
(cardiac hypertrophy) హృదయపరిమాణములో పెరుగుదల (cardiac dilatation) కలిగి హృదయము స్తూపాకారతను పొందుతుంది. స్తూపాకారత వలన జఠరికల సంకోచముల సార్థకత తగ్గుతుంది .
(cardiac hypertrophy) హృదయపరిమాణములో పెరుగుదల (cardiac dilatation) కలిగి హృదయము స్తూపాకారతను పొందుతుంది. స్తూపాకారత వలన జఠరికల సంకోచముల సార్థకత తగ్గుతుంది .
రెనిన్ ఏంజియోటెన్సిన్ ఆల్డోష్టిరోన్ వ్యవస్థ (renin angiotensin
aldosterone system), మూత్రపు ఉత్పత్తి తగ్గించే వాసోప్రెస్సిన్ (Vasopressin -
Anti diuretic hormone ADH) ఉత్తేజింపబడి దేహములో సుదూర రక్తనాళముల సంకోచము, లవణము,
నీరుల నిలువ పెరిగి శరీరములో రక్తపు ఘనపరిమాణము కూడా పెరుగుతుంది. అందువలన గుండెపై
ఒత్తిడి కూడా పెరుగుతుంది.
సహవేదన నాడీమండల ప్రకోపనము వలన రక్తములో ఎడ్రినలిన్, నారెడ్రినలిన్ వంటి
కాటిఖాలమైనులు (catecholamines) పెరిగి గుండె వేగమును, హృదయకండరములు
ముకుళించుకొనుటను (contractility) పెంచుతాయి. అందువలన హృదయానికి ప్రాణవాయుపు
అవసరము కూడా పెరుగుతుంది.
నాడీ రసాయినకముల (neurotransmitters) ప్రభావము వలన గుండెలో కణ విధ్వంసము,
తంతీకరణము (fibrosis), గుండె లయలో మార్పులు (cardiac arrhythmias) గుండె బలహీనత
గుండె వైఫల్యము కలుగుతాయి. శరీరములో లవణ పరిమాణము, ఉదకపరిమాణము పెరిగి సిరలలో
సాంద్రత (congestion), పెరుగుతుంది. అవయవములకు రక్తప్రసరణ తగ్గుట వలన అవయవముల
క్రియాశక్తి కూడా తగ్గే అవకాశమున్నది.
హృదయ వైఫల్య లక్షణములు :
హృదయ వైఫల్యము గల వారిలో ఆయాసము తొలుత శరీరపు శ్రమతో మొదలిడినా,
తీవ్రతరమయినపుడు విశ్రాంతి సమయాలలో కూడా కలుగుతుంది, నీరసము, త్వరితముగా అలసట,
వ్యాయామ శారీరక శ్రమలను భరించ లేక పోవుట, రాత్రులలో ఆకస్మికముగా ఆయాసము కలుగుట,
బల్లపరపుగా పడుకున్నపుడు ఊపిరి ఆడకపోవుట (orthopnea) కలుగుతాయి.
సిరలలో రక్తపు సాంద్రత ఎక్కువై శరీర క్రింది భాగములలో నీరు పట్టి, కాళ్ళు, చేతులు పొంగుట, పుపుస సిరలలో రక్తపు సాంద్రత పెరుగుట వలన గాలిబుడగలలో (alveoli) మధ్య నీరు పట్టి దగ్గు, ఆయాసము, ఊపిరితో పిల్లికూతలు (wheezing) కలుగుతాయి.

గుండెదడ, కళ్ళుతిరుగుట, నిలుచున్నపుడు తాత్కాలిక అపస్మారము రావచ్చును.
గుండెనొప్పి కూడా కలుగవచ్చును .
గుండెలో అసాధారణ లయలు (arrhythmias) కలుగుతే వాటి లక్షణములు (గుండెదడ, అపస్మారకత, ఆకస్మికముగా గుండె ఆగిపోవుట) కలుగ వచ్చును.
గుండెలో అసాధారణ లయలు (arrhythmias) కలుగుతే వాటి లక్షణములు (గుండెదడ, అపస్మారకత, ఆకస్మికముగా గుండె ఆగిపోవుట) కలుగ వచ్చును.
హృదయ వైఫల్యము తీవ్రతరమైనపుడు, మూత్రపిండముల వ్యాపారము మందగించి
వ్యర్థపదార్థముల విసర్జన, మూత్రపరిమాణము తగ్గుట కలుగవచ్చు. అపుడు శరీరములో లవణము,
నీటి నిలువలు పెరిగి శరీరములో పొంగులు(edema), ఊపిరితిత్తులలో నీటి ఉబ్బు (pulmonary
edema) అధికమవుతాయి.
కాలేయములో నీటిఉబ్బు (hepatic congestion) కలిగితే కాలేయ వ్యాపారము మందగించవచ్చును. కాలేయ జీవోత్ప్రేరకముల (liver enzymes) విలువలు పెరుగ వచ్చును. పచ్చకామెర్లు కూడా కలుగ వచ్చును. ఉదరకుహరములో నీరు పట్టి జలోదరమును (ascites) కలిగించవచ్చును.

వైద్యుల పరీక్షలో పాదములలోను, చీలమండ వద్ద నీటిపొంగును గుర్తించగలరు.
వేలితో నొక్కిఉంచుతే లొత్త పడుతుంది. (నీటిపొంగుకి ఇతర కారణములు కూడా ఉండవచ్చును.)
వినికిడి గొట్టముతో విన్నపుడు సామాన్యముగా వినిపించే మొదటి రెండవ గుండెశబ్దములతో బాటు మూడు లేక నాల్గవ శబ్దములు కూడా వినిపించవచ్చును. గుఱ్ఱపు దాట్ల వలె గుండె శబ్దములు
(galloping) ఉండవచ్చును. త్రిపత్ర ద్విపత్ర కవాటముల పరిమాణము పెరిగి తిరోగమన రక్తప్రవాహము
(regurgitation) కలిగితే మర్మర శబ్దములు (murmurs) కూడా వినిపించ వచ్చును. ఛాతిపై విన్నపుడు క్రిందిభాగములలో చిటపట శబ్దములు వినిపించవచ్చును. కంఠసిరలలో ఉబ్బుదల కనిపెట్టగలరు. పుపుసవేష్టనములో (pleural effusion) నీరుపట్టవచ్చును.సాధారణము కాదు గాని హృదయకోశములో కూడా నీరు పట్టవచ్చును (pericardial effusion) . కాలేయములో నీటి పొంగు వలన కాలేయపు పరిమాణము పెరగవచ్చును. నెమ్మదిగా కాలేయభాగములో చేతిని అదిమిపట్టితే కంఠసిరలలో ఉబ్బుదల పెరగడము గమనించగలరు (hepato jugular reflux)

రక్తపరీక్షలు :
హృదయవైఫల్య లక్షణము లున్నవారికి రక్తకణపరీక్షలు, హీమోగ్లోబిన్, రక్తములో
ఎఱ్ఱరక్తకణముల ఘనపరిమాణ శాతమును (hematocrit) సాధారణముగా పరీక్షించి రక్తహీనత
లేదని నిర్ధారణ చేసు కోవాలి. రక్తములో సోడియమ్, పొటాసియమ్, క్లోరైడు,
బైకార్బొనేట్ల విలువలను మూత్రపిండముల వ్యాపారమును తెలిపే యూరియా నైట్రొజెన్,
క్రియటినిన్ విలువలను తెలుసుకొనుట అవసరము. చికిత్స పొందుతున్న వారిలో యీ పరీక్షలను
మధ్య మధ్యలో పరిశీలించుట కూడా చాలా అవసరము.
కాలేయ వ్యాపారపరీక్షలు (liver function tests), గళగ్రంథి స్రావక పరీక్షలు (thyroid hormones), రక్తములో చక్కెర విలువలు, కొలెష్ట్రాలు యితర కొవ్వుపదార్థాల పరీక్షలు కూడా అవసరమే.
కాలేయ వ్యాపారపరీక్షలు (liver function tests), గళగ్రంథి స్రావక పరీక్షలు (thyroid hormones), రక్తములో చక్కెర విలువలు, కొలెష్ట్రాలు యితర కొవ్వుపదార్థాల పరీక్షలు కూడా అవసరమే.
బి- నేట్రియురెటిక్ పెప్టైడ్ (B type Natriuretic Peptide) :
హృదయవైఫల్యము కల వారిలో రక్తఘనపరిమాణము పెరిగి హృదయపు అరల సాగుదల వాని
ఘనపరిమాణములో హెచ్చుదల కలిగినప్పుడు హృదయ కండరకణములు బి- నేట్ర్రియురెటిక్
పెప్టైడ్ అనే రసాయనమును అధికముగా ఉత్పత్తి చేస్తాయి. హృదయవైఫల్యము గల వారిలో బి
నేట్రియురెటిక్ పెప్టైడు విలువలు 400 మించి ఉంటాయి. ఆ విలువ 100 కంటె తక్కువైతే
హృదయవైఫల్యము లేదని నిర్ధారించవచ్చును. మూత్రపిండముల వ్యాపార లోపమున్న వారిలో యీ
విలువలు ఎక్కువగా ఉండవచ్చును.
ఛాతి ఎక్స్ రే అవసరము. ఊపిరితిత్తులలో నీటి ఉబ్బును (Pulmonary edema)
కనుగొనుటకు ఆయాసము కలిగించే ఊపిరితిత్తుల తాపము (Pneumonia) వాయుపూరిత పుపుసవేష్టనము
(Pneumothorax) వంటి ఊపితిత్తుల వ్యాధులను, పుపుసవేష్టనములో నీటి చేరికను (Pleural effusion) కనుగొనుటకు ఎక్స్ రే చిత్రములు ఉపయోగపడుతాయి.
(Pneumothorax) వంటి ఊపితిత్తుల వ్యాధులను, పుపుసవేష్టనములో నీటి చేరికను (Pleural effusion) కనుగొనుటకు ఎక్స్ రే చిత్రములు ఉపయోగపడుతాయి.
హృదయవిద్యుల్లేఖ (Electrocardiogram) :
హృదయ ధమనుల వ్యాధిని (Coronary artery disease) సూచించవచ్చు. హృదయ లయలో భేదములను (arrhythmias) హృదయములో విద్యుత్ప్రవాహ మాంద్యమును (conduction delays) కనుగొనుటకు తోడ్పడుతుంది.
హృదయ ధమనుల వ్యాధిని (Coronary artery disease) సూచించవచ్చు. హృదయ లయలో భేదములను (arrhythmias) హృదయములో విద్యుత్ప్రవాహ మాంద్యమును (conduction delays) కనుగొనుటకు తోడ్పడుతుంది.
అతిధ్వని శ్రవణసాధనముతో హృదయ చిత్రీకరణ (echocardiogram) చేసి హృదయ
నిర్మాణమును, హృదయములో రక్తచలనమును, కవాటముల వ్యాపారమును తెలుసుకొన వచ్చును. ఎడమ జఠరిక
సంపూర్ణవికాసము నొందినపుడు రక్తపరిమాణమును(end diastolic volume) సంపూర్ణముగా
ముకుళించినపుడు రక్తపరిమాణమును (end systolic volume) గణించి ఎడమ జఠరిక నుంచి
బృహద్ధమనికి ప్రసరించు రక్తశాతమును (ejection fraction) కనుగొన వచ్చును.
సాధారణముగా వయోజనులలో ప్రసరణ శాతము 55 % నుంచి 65 % శాతము ఉంటుంది.
హృదయ కండర వికాస లోపము వలన హృదయవైఫల్యము (diastolic failure) కలిగిన వారిలో జఠరిక నుంచి బృహద్ధమని లోనికి ప్రసరించు రక్తశాతపు విలువలు సాధారణ పరిమితులలో (50 % శాతముకంటె ఎక్కువగా) ఉంటుంది.
కండరనష్టము, లేక కండర వ్యాపార లోపము ఉన్నవారిలో ఎడమ జఠరిక ముకుళించుకొనుటలో లోపము కలిగి బృహద్ధమనికి ప్రసరించు రక్తశాతము (ejection fraction) తగ్గుతుంది .
ఈ విలువ హృదయవైఫల్యము ముకుళిత లోపము (Systolic heart failure) వలనా లేక వికాస లోపము వలన (Diastolic heart failure) కలిగిందో నిశ్చయించుటకు తోడ్పడుతుంది.

హృదయ ధమనుల వ్యాధి లక్షణములు ఉన్నవారికి ధమనీ చిత్రీకరణ (Angiogram)
అవసరము.
హృదయమునకు అయస్కాంత అనునాద చిత్రీకరణముతో (Magnetic Resonance Imaging Scan)
హృదయ నిర్మాణ వ్యాపారాలను, వ్యాధులను కనుగొన వచ్చును.
హృదయవైఫల్యపు అంతస్థులు :
1 వ శ్రేణి : వీరికి హెచ్చయిన శరీరపు శ్రమతో ఆయాసము కలుగుతుంది.
2వ శ్రేణి : వీరికి మధ్య తరహా శ్రమతో ఆయాసము కలుగుతుంది
3వ శ్రేణి : వీరికి కొద్దిపాటి శ్రమకే ఆయాసము కలుగుతుంది.
4 వ శ్రేణి : వీరికి విశ్రాంతి సమయములో కూడా ఆయాసము ఉంటుంది.
చికిత్స :
హృదయవైఫల్యము వలన శరీరములో కలిగే అవాంఛిత పరణామాలను అవరోధించుట చికిత్సలో
ముఖ్యభాగము. సహవేదన నాడీమండలము ఉత్తేజము నొందుట వలన విడుదలయే
కాటిఖాలైమన్లను (catecholamines) అవరోధించుటకు బీటా గ్రాహక అవరోధకములను (beta adrenergic blockers) రెనిన్ ఏంజియోటెన్సిన్ ఆల్డోష్టిరోన్ వ్యవస్థతో విడుదల అయే ఆల్డోష్టిరోన్ ఫలితములను అరికట్టుటకు ఏంజియోటెన్సిన్ ని మార్చెడి జీవోత్ప్రేరక నిరోధకములను (Angiotensin Converting Enzyme inhibitors) ఆల్డోష్టిరోన్ గ్రాహక అవరోధకములను (aldosterone receptor blockers), రక్తనాళములను వ్యాకోచింపజేసి హృదయపు శ్రమను తగ్గించే ఔషధములు (vasodilators), శరీరములో లవణపు, నీరు ఎక్కువయి కాళ్ళు పాదములలో పొంగులు, ఊపిరితిత్తులలో నీటి ఉబ్బు కలిగినపుడు మూత్రకారకములను (diuretics) వైద్యులు ఉపయోగిస్తారు.

బీటాగ్రాహక అవరోధకములు (beta receptor blockers) :
హృదయవైఫల్యములో సత్ఫలితాల నిచ్చేవి కార్వెడిలాల్ (carvedilol) మెటోప్రొలాల్ (metoprolol), బిసోప్రొలాల్ (besoprolol) . ఇవి గుండెపై ఒత్తిడిని గుండె వేగమును తగ్గిస్తాయి. రక్తనాళములలో పోటుని తగ్గించి హృదయపు శ్రమను తగ్గిస్తాయి. బృహద్ధమని లోనికి ప్రసరించే రక్తశాతమును (ejection fraction), జఠరిక వ్యాపార నైపుణ్యమును పెంచి వ్యాయామ సహనమును పెంచుతాయి. లయ భేదములను అదుపులో ఉంచి జీవితకాలమును పెంచుతాయి. తక్కువ మోతాదులలో మొదలుపెట్టి రక్తపుపోటు, గుండె వేగము, రోగలక్షణములను గమనిస్తూ అవాంఛిత ఫలితములు రానంత మేరకు మోతాదులను క్రమముగా పెంచుతాము.

ఏంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైము ఇన్హిబిటర్స్ (Angiotensin Converting
Enzyme Inhibitors) :
కాలేయములో ఏంజియోటెన్సినోజెన్ (angiotensinogen)ఉత్పత్తి అయి
మూత్రపిండములలో ఉత్పత్తి అయే రెనిన్ (Renin) వలన ఏంజియోటెన్సిన్ -1 గా మారుతుంది.
ఏంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఏంజియోటెన్సిన్ -1 ని ఏంజియోటెన్సిన్ -2 గా
మారుస్తుంది . ఏంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్లు ఆ జీవోత్ప్రేరకమును
నిరోధించి ఏంజియోటెన్సిన్ -2 ఉత్పత్తిని తగ్గిస్తాయి. అందువలన రక్తనాళముల సంకోచము
తగ్గి రక్తపీడనము తగ్గుతుంది. ప్రధాన అవయవములకు రక్తప్రసరణ పెరుగుతుంది. రెనిన్
ఏంజియోటెన్సిన్ వ్యవస్థ వలన సమకూడే లవణపు నిలువలు నీటి నిలువలు తగ్గి
రక్తఘనపరిమాణము తగ్గుతుంది. హృదయముపై భారము, హృదయపు శ్రమ తగ్గుతాయి. ఈ ఔషధముల వలన
హృదయవైఫల్య లక్షణములు తగ్గి, రోగుల ఆయుఃప్రమాణము పెరుగుతుంది.
హృదయవైఫల్య లక్షణములు పొడచూపకపోయినా ఎడమజఠరిక వ్యాపారము మందగించిన వారిలోను (జఠరిక నుంచి బృహద్ధమనికి ప్రసరించు రక్తశాతము (ejection fraction) తగ్గిన వారిలో) హృదయధమనుల వ్యాధి (Coronary artery disease) కలవారిలోను, అధిక రక్తపీడనము, మధుమేహవ్యాధి కలవారిలోను ACE Inhibitors హృదయవైఫల్యమును అరికట్టుటకు ఉపయోగపడుతాయి.
తక్కువ మోతాదులలో మొదలుపెట్టి క్రమముగా రక్తపీడనమును, మూత్రపిండవ్యాపార పరీక్షలను, సీరమ్ పొటాసియపు విలువలను రక్తకణ గణనలను గమనిస్తూ మోతాదులను సర్దుబాటు చెయ్యాలి.
కొందఱిలో వీని వలన దగ్గు కలగవచ్చును. సీరమ్ లో పొటాసియమ్ విలువలు అధికమవ వచ్చును. నాలుక, పెదవులు, కనురెప్పలలో పొంగు (Angio edema) కలుగుతే ఈ మందుల వాడుకను వెంటనే మానివేయాలి.

ఏంజియోటెన్సిన్ గ్రాహక అవరోధకములు (Angiotensin Receptor Blockers) :
ఇవి ఏంజియోటెన్సిన్ గ్రాహకములను అవరోధిస్తాయి. ACE Inhibitors ని దగ్గు
మొదలైన కారణాల వలన సహించలేని వారికి ఇవి తోడ్పడుతాయి. మూత్రపిండ వ్యాపారమును,
పొటాసియమ్ విలువలను ఈ మందులు వాడే వారిలో గమనిస్తూ ఉండాలి.
రక్తనాళ వ్యాకోచకములు (vasodilators) :
హైడ్రాలజిన్ (Hydralazine) : హైడ్రలజిన్ ధమనులను వ్యాకోచింపజేసి వానిలో
పీడనమును తగ్గిస్తుంది. అందువలన హృదయపు శ్రమ తగ్గుతుంది.
నైట్రేట్లు (nitrates) : ఇవి సిరలను వ్యాకోచింపజేసి వానిలో రక్తసాంద్రతను (venous
congestion) తగ్గిస్తాయి. పుపుస సిరలలో రక్తసాంద్రతను (pulmonary congestion)
తగ్గిస్తాయి. జఠరికలలో రక్తప్రవాహ పీడనమును (ventricular filling pressure)
తగ్గించి హృద్ధమనులను వ్యాకోచింపజేసి హృదయానికి రక్తప్రసరణను పెంచుతాయి. వీనివలన
అల్పరక్తపీడనము (hypotension) కలిగే అవకాశమున్నది. అందువలన మోతాదులను సవరించ వలసిన
అవసరము కలుగవచ్చును.
డిజోక్సిన్ (Digoxin) :
డిజిటాలిస్ ఆల్కలాయిడ్స్ హృదయ ముకుళితమును (contractility) పెంపొందజేస్తాయి. హృదయవేగమును తగ్గిస్తాయి. హృదయవైఫల్యమునకు ఒకప్పుడు తప్పనిసరిగా వాడే డిజాక్సిన్ మెరుగైన మందులు రావడము వలన, అవాంఛిత ఫలితముల వలన ఈ దినములలో ఎక్కువగా వాడబడుట లేదు. కర్ణికాప్రకంపనలు (atrial fibrillation) కల వారిలో జఠరికల వేగమును అదుపులో పెట్టుటకు వారిలో హృదయవైఫల్యపు చికిత్సలో డిజాక్సిన్ కి స్థానముంది. రక్తములో దీని విలువలను తఱచు పరీక్షించాలి. విలువలు అధికమైతే వికారము, వాంతులు, హృదయవేగము మందగించుట, లయ తప్పుట వంటి అవాంఛిత ఫలితములు కలుగుతాయి.

మూత్రకారకములు (Diuretics) :
హృదయవైఫల్యము వలన లవణము, నీరు శరీరములో అధికమయి, నీటిపొంగులు, ఊపిరితిత్తులలో నీటిపొంగు, సాంద్రత ఎక్కువయి ఆయాసము వంటి బాధలు కలిగిన వారిలో ఆ లక్షణములను నివారించుటకు మూత్రకారకములను ఉపయోగించవలసి ఉంటుంది. ఇవి మూత్రోత్పత్తిని పెంచి శరీరములో నీటిని, లవణమును తగ్గిస్తాయి. వీనిని ఉపయోగించినపుడు రక్తములో ఎలొక్ట్రలైటు
(electrolytes - విద్యుద్వాహక లవణములు) విలువలను, యూరియా నైట్రొజెన్ . క్రియటినిన్ విలువలను రక్తపీడనమును తఱచు గమనించాలి.
రక్తపరిమాణము విపరీతముగా తగ్గకుండా జాగ్రత్త పడాలి. రక్తప్రమాణము తగ్గినపుడు నిలుచున్నపుడు రక్తపీడనము తగ్గి కళ్ళుతిరుగుట, సొమ్మసిల్లుట వంటి లక్షణములు కలుగవచ్చును. శరీరపు బరువును గమనించి, పాదములు, కాళ్ళలో పొంగులను గమనిస్తూ, రోగులను తఱచు పరీక్షిస్తూ తగిన రక్తపరీక్షలు చేస్తూ వైద్యులు మూత్రకారకముల మోతాదును సరిచేస్తుంటారు.

థయజైడు మూత్రకారకములు (thiazide diuretics) ;
హైడ్రోక్లోర్ థయజైడ్ (Hydrochlorthiazide), క్లోర్థాలిడోన్ (Chlorthalidone) సాధుమూత్రకారకములు. మితముగా నీటిపొంగులు, నీటినిలువలు పెరిగిన వారికి మూత్రపిండముల వ్యాపార ప్రక్రియ బాగున్నవారిలో ఉపయోగపడుతాయి.
హైడ్రోక్లోర్ థయజైడ్ (Hydrochlorthiazide), క్లోర్థాలిడోన్ (Chlorthalidone) సాధుమూత్రకారకములు. మితముగా నీటిపొంగులు, నీటినిలువలు పెరిగిన వారికి మూత్రపిండముల వ్యాపార ప్రక్రియ బాగున్నవారిలో ఉపయోగపడుతాయి.
మెటోలజోన్ (metolazone) : థయజైడ్ మూత్రకారకమే గాని నెఫ్రాన్ నాళికల ప్రథమ,
అంతిమ భాగాలపై పనిచేసి, లూప్ మూత్రకారకములతో బాటు వాడినపుడు మూత్రపిండవ్యాపారము
మందగించిన వారిలో ఉపయోగపడుతుంది.
మెలిక మూత్రకారకములు (Loop diuretics) :
ఫ్యురొసిమైడ్ (furosemide), టోర్సిమైడ్ (torsemide) బ్యుమటిడిన్ (bumetanide)
ఎథాక్రినిక్ ఏసిడ్ (ethacrynic acid) : వీనిని లూప్ డైయూరెటిక్స్ అని అంటారు.
మూత్రపిండములలో వ్యాపార విభాగములైన నెఫ్రానుల నాళికల మెలికలపై పనిచేసి మూత్రము
నధికము చేస్తాయి. వీనిని వాడే వారిలో పొటాసియమ్ కూడ వ్యర్థమవుతుంది కాబట్టి
పొటాసియము లవణమును లేక పొటాసియమును పొదుపు చేసే మూత్రకారకములను కూడా సాధారణముగా
వీటితో బాటు వాడవలసి ఉంటుంది.
మూత్రపిండముల వ్యాపారము తగ్గినవారిలో కూడా ఇవి పనిచేస్తాయి.
మూత్రపిండముల వ్యాపారము తగ్గినవారిలో కూడా ఇవి పనిచేస్తాయి.
పొటాసియమును పొదుపు పఱచే మూత్రకారకములు (potassium sparing diuretics):
ఇవి ఆల్డోష్టిరోన్ గ్రాహకములను నిరోధించి మూత్రము నధికము చేస్తాయి. పొటాసియమును పొదుపుచేస్తాయి.
ఇవి సాధుమూత్ర కారకములు . అందువలన సాధారణముగా లూప్ మూత్రకారకములతో బాటు వాడుతారు.
స్పైరనోలేక్టోన్ (spironolactone), ఎప్లిరినోన్ (eplirenone) వాడుకలో ఉన్నవి. వీని వాడుక వలన పొటాసియము పెరిగే అవకాశమున్నది. మూత్రపిండముల వ్యాపారము బాగా మందగించినపుడు, ఏంజియోటెన్సిన్ ఎంజైమ్ నిరోధకములను వాడినపుడు, నాన్ ష్టీరాయిడల్ తాపకహరులను (non steroidal anti inflammatory agents) వాడే వారిలోను పొటాసియము అధికమయే అవకాశము ఎక్కువ. పొటాసియమ్ విలువలను తఱచు పరిశీలించాలి. హృదయవైఫల్యము తీవ్రమయిన వారిలో యివి రోగలక్షణములు నివారించుటకు, ఆయువును పెంచుటకు ఉపయోగపడుతాయి.

జఠరికల ముకుళింపును పెంపెందించే డోపమిన్ (dopamine), డోబ్యుటమిన్ (dobutamine)
మిల్రినోన్ (milrinone) హృదయవైఫల్యము తీవ్రతరమైన వారిలో ఉపయోగపడుతాయి. వీనిని సిరల
ద్వారా రోగులను నిత్యము గమనిస్తూ వైద్యశాలలలో వాడుతారు.
సాక్యుబిట్రిల్ / వాల్సార్టన్ (Sacubitril / Valsartan) లో వాల్సార్టన్
ఏంజియోటెన్సిన్ గ్రాహక నిరోధకము.(angiotensin receptor blocker) . సాక్యుబిట్రిల్
హృదయకండర కణములు ఉత్పత్తి చేసే నేట్రియురెటిక్ పెప్టైడు విధ్వంసమును
అడ్డుకుంటొంది. ఆ రెండు రసాయనములు రక్తపీడనమును తగ్గిస్తాయి. మూత్రపు ఉత్పత్తిని
పెంచి రక్తపరిమాణమును తగ్గిస్తాయి. ఈ ఔషధ మిశ్రమమును ప్రసరణ శాతము (ejection
fraction) తగ్గిన వారికి ఉపయోగపడుతుంది.
రక్తహీనము (anemia), గళగ్రంథి ఆధిక్యత, గళగ్రంథిలోపము, బెరిబెరి వంటి
వ్యాధులున్న వారికి
ఆ యా వ్యాధుల చికిత్సలు అవసరము.
ఆ యా వ్యాధుల చికిత్సలు అవసరము.
జీవనశైలి మార్పులు :
హృదయవైఫల్యము ఉన్నవారు ఉప్పును మితముగా వాడాలి. త్రాగే నీటిని కూడా దినమునకు ఒకటిన్నర, రెండు లీటర్లకు మితపరచుకోవాలి. మూత్రకారకములను వాడుతూ నీటి నీటినెక్కువగా త్రాగే వారిలో సోడియమ్ విలువలు బాగా తగ్గే అవకాశమున్నది.

పొగత్రాగరాదు. విపరీత లక్షణములు లేని వారు తగినంత వ్యాయామమును చెయ్యాలి.
ఊబకాయమున్నవారు బరువు తగ్గుటకు కృషిచెయ్యాలి. కొలెష్టరాలును అదుపులో ఉంచుకోవాలి.
మధుమేహవ్యాధిని అదుపులో పెట్దటుకోవాలి. హృదయముపై వ్యతిరేకముగా పనిచేసే ఔషధాల
వాడుకను నియంత్రించాలి.
ప్రాణవాయువు :
కేశనాళిక ప్రాణవాయు పరిమాణము (capillary oxygen saturation) తగ్గిన వారికి ఆయాసమున్న వారికి ప్రాణవాయువును కృత్రిమముగా అందించాలి.
కేశనాళిక ప్రాణవాయు పరిమాణము (capillary oxygen saturation) తగ్గిన వారికి ఆయాసమున్న వారికి ప్రాణవాయువును కృత్రిమముగా అందించాలి.
ఊపిరితిత్తులలో నీటిపొంగు ఔషధములకు త్వరగా తగ్గక రక్తపు ప్రాణవాయువు
విలువలు బాగా తగ్గినపుడు, బొగ్గపులుసు వాయువు ప్రమాణములు బాగా పెరిగినపుడు,
కృత్రిమశ్వాసపరికరములను ఉపయోగించవలసి ఉంటుంది.
రక్తశుద్ధి (Dialysis) :
హృదయవైఫల్యముతో బాటు మూత్రపిండముల వైఫల్యము చివరి దశలో ఉన్నవారికి
రక్తశుద్ధి చేస్తూ వ్యర్థపదార్థములను, అధికమైన జలలవణములను కూడా తొలగించాలి.
అందఱిలో యీ రక్తశుద్ధి సాధ్యము కాదు.
శస్త్రచికిత్సలు :
హృద్ధమనుల వ్యాధి ఉన్నవారికి ధమనుల వ్యాకోచప్రక్రియ (angioplasty with
stent placement), లేక ప్రత్యామ్నాయ ప్రసరణ శస్త్రచికిత్సలు (Arterial bypass
surgery) చేసి హృదయపు రక్తప్రసరణను పునరుద్ధింపజేయాలి.
హృదయపు విద్యుత్ప్రేరణ ఉత్పత్తి లోను (generation of electrical impulse),
విద్యుత్ప్రేరణ ప్రసరణలలో (conduction of electrical impulse) భంగమేర్పడి కర్ణికలు,
జఠరికల వేగము మందగించిన వారికి కృత్రిమ హృదయ విద్యత్ప్రేరణ పరికరము (cardiac
pacemaker) అమర్చాలి.
హృదయకవాట పరిమాణములు బాగా తగ్గిన వారికి (valvular stenosis), పరిమాణములు
పెరిగి రక్త తిరోగమనము (valvular regurgitation) విపరీతముగా నున్నవారికి కొత్త
కవాటములను అమర్చాలి.
హృదయకోశములో నీరుపట్టిన వారికి (pericardial effusion) ఆ నీటిని
తొలగించాలి. హృదయకోశపు తాపప్రక్రియ (pericarditis) వలన హృదయ ముకుళిత వికాసములకు
భంగ మేర్పడిన వారికి శస్త్రచికిత్సతో హృదయకోశమును తొలగించాలి (pericardiectomy) .
ఎడమ జఠరిక నుంచి బృహద్ధమని లోనికి ప్రసరించు రక్తశాతము - ప్రసరణశాతము (ejection
fraction) 35 % కంటె తక్కువైతే ఔషధములతో చికిత్స చేసి తగిన ప్రగతి కనిపించకపోతే
వారికి
ప్రకంపన నిరోధిని (defibrillator) అమర్చి ఆకస్మిక హృదయమరణములను తగ్గించవచ్చును.
ప్రకంపన నిరోధిని (defibrillator) అమర్చి ఆకస్మిక హృదయమరణములను తగ్గించవచ్చును.
హృదయ ముకుళిత సహాయ పరికరములు (ventricular assist devices) తాత్కాలిక
ప్రయోజనమునకు లభ్యము. ఇతర అవయవ వ్యాపారములు బాగుండి, వయోవృద్ధులు కాని వారికి
హృదయమార్పిడి చికిత్సను (cardiac transplantation) పరిశీలించాలి.
హృదయవైఫల్యమును వైద్యులు నిత్యము చూస్తారు. కొందఱికి అత్యవసర చికిత్స
అవసరము.
చికిత్సలో రక్తపరీక్షలు, బాధితులను తఱచు పరీక్షించుట, చాలా అవసరము. ఇదివరలో లక్షణములకే చికిత్సలు ఉండేవి. ఇప్పుడు హృదయవ్యాపారమును మెరుగు పఱచే చికిత్సలు లభ్యమయి హృదయవైఫల్యము గలవారి ఆయుః ప్రమాణములలో పెరుగుదల, లక్షణములకు ఉపశమనము పెరుగుట గమనిస్తున్నాము.

(నా వ్యాసముల లక్ష్యము వైద్యవిషయాలను తెలుగులో చెప్పడము, తగిన సమాచారమును
చేకూర్చుట, వైద్యవిషయములపై అవగాహన నా శక్తిమేరకు చేకూర్చడము మాత్రమే.
వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను తప్పక సంప్రదించాలి.
(ఉపయుక్తమనుకుంటే నిరభ్యంతరముగా
పంచుకొనండి)
-----------------------------------------------------