|
18, జూన్ 2018, సోమవారం
గళగ్రంథి ఆధిక్యత ( Hyperthyroidism)
11, జూన్ 2018, సోమవారం
గళగ్రంథిహీనత ( Hypothyroidism )
తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో:
గళగ్రంథిహీనత ( Hypothyroidism )
డా. గన్నవరపు నరసింహమూర్తి.
నిత్యజీవన ప్రక్రియకు గళగ్రంథి స్రావములు ( Thyroid hormones ) ఎంతగానో అవసరము. ఈ కంఠగ్రంథి ( Thyroid gland ) కంఠము ముందర స్వరపేటిక శ్వాసనాళముల నానుకొని సీతాకోకచిలుక ఆకారములో ఉంటుంది. ఈ గ్రంథికి కర్ణికలు ( Lobes ) రెండుప్రక్కలా ఉండి ఆ రెండు కర్ణికలను కలుపుతూ నడిమిన సంధానము. ( Isthmus) ఉంటుంది. వయోజనులలో యీ గళగ్రంథికర్ణిక పరిమాణము 5 సె.మీ ఎత్తు, 3 సె.మీ ,వెడల్పు 2 సె.మీ మందము గలిగి ఉంటుంది. గళగ్రంథి స్రావములు థైరాక్సిన్ ( Thyroxin T-4 ), ట్రై అయిడో థైరొనిన్ ( Triiodothyronine, T-3 ) , కణజాలములలో జీవవ్యాపార క్రియకు ( Body metabolism ) దోహదకారిగా ఉంటాయి. శిశువుల వృద్ధికి, మనోవికాసమునకు కూడా థైరాక్సిన్ తోడ్పడుతుంది. జంతుజాలములో విశ్రాంత జీవవ్యాపార ప్రమాణము ( Basal metabolic rate ) గళగ్రంథి స్రావకములపై ఆధారపడి ఉంటుంది.
గళగ్రంథినుంచి అధికముగా థైరాక్సిన్ ( సుమారు 80 శాతము ) ఉత్పత్తి జరుగుతుంది.
ట్రై అయిడో థైరొనిన్ సుమారు 20 శాతము ఉత్పత్తి జరుగుతుంది. కాని కణజాలములో ట్రైఅయిడోథైరొనిన్ కు మాత్రమే చైతన్యము ఉంటుంది. అధికముగ థైరాక్సిన్ ఉత్పత్తి అయినా కాలేయములో ఒక అయొడిన్ అయము తొలగించబడి థైరాక్సిన్ ( T4 ) టైఅయిడో థైరొనిన్( T3 )
గా మార్పుజెందుతుంది.
ట్రై అయిడో థైరొనిన్ సుమారు 20 శాతము ఉత్పత్తి జరుగుతుంది. కాని కణజాలములో ట్రైఅయిడోథైరొనిన్ కు మాత్రమే చైతన్యము ఉంటుంది. అధికముగ థైరాక్సిన్ ఉత్పత్తి అయినా కాలేయములో ఒక అయొడిన్ అయము తొలగించబడి థైరాక్సిన్ ( T4 ) టైఅయిడో థైరొనిన్( T3 )
గా మార్పుజెందుతుంది.
గళగ్రంథి స్రావకములు, థైరాక్సిన్ ( T4 ) అణువులో నాలుగు అయొడిన్ పరమాణువులు, ట్రైఅయిడో థైరొనిన్ ( T3 )లో మూడు అయొడిన్ పరమాణువులు ఉంటాయి.
గళగ్రంథి స్రావకముల ఉత్పత్తిని, రక్తములో వాటి విడుదలను పీనస గ్రంధి ( Pituitary gland ) నుంచి విడుదల అయే గళగ్రంథి ప్రేరేపకము ( Thyroid stimulating hormone ; Thyrotropin ) నియంత్రిస్తుంది.
గళగ్రంథి ప్రేరేపకపు ( TSH ) విడుదలను మెదడు క్రింది భాగములో ఉండే హైపోథలమస్
( Hypothalamus) గళగ్రంథి ప్రేరేపక విమోచిని ( Thyrotropin releasing hormone) ద్వారా నియంత్రిస్తుంది.
( Hypothalamus) గళగ్రంథి ప్రేరేపక విమోచిని ( Thyrotropin releasing hormone) ద్వారా నియంత్రిస్తుంది.
రక్తములో గళగ్రంథి స్రావకముల ( Thyroid hormones) ప్రమాణము పెరిగినప్పుడు, పీనసగ్రంథి
( Pituitary gland ) నుంచి గళగ్రంథిప్రేరేపకపు ( TSH ) విడుదల తగ్గుతుంది.
( Pituitary gland ) నుంచి గళగ్రంథిప్రేరేపకపు ( TSH ) విడుదల తగ్గుతుంది.
గళగ్రంథి స్రావకముల ( T3, T4 ) ప్రమాణము తగ్గినపుడు గళగ్రంథి ప్రేరేపకపు ( TSH ) విడుదల హెచ్చవుతుంది.
ఆ విధముగా గళగ్రంథి ప్రేరేపకపు విడుదల రక్త ప్రసరణములో ఉండే గళగ్రంథి స్రావకముల ప్రతివర్తమానము ( Feed back) పై ఆధారపడి ఉంటుంది.
రక్తములో గళగ్రంథి ప్రేరేపకపు ( TSH )విలువ హెచ్చుగా ఉంటే అది గళగ్రంథి హీనతను
( Hypothyroidism ) సూచిస్తుంది. గళగ్రంథి చైతన్యము హెచ్చయి ( Hyperthyroidism) గళగ్రంథి స్రావకముల రక్తప్రమాణాలు హెచ్చయితే గళగ్రంథి ప్రేరేపకపు ( TSH )విలువలు తక్కువగా ఉంటాయి.
( Hypothyroidism ) సూచిస్తుంది. గళగ్రంథి చైతన్యము హెచ్చయి ( Hyperthyroidism) గళగ్రంథి స్రావకముల రక్తప్రమాణాలు హెచ్చయితే గళగ్రంథి ప్రేరేపకపు ( TSH )విలువలు తక్కువగా ఉంటాయి.
శరీరపు పెరుగుదల ఎక్కువగా ఉన్నపుడు శరీరావసరాలకు తగినట్లు పీనసగ్రంథి నుంచి గళగ్రంథి ప్రేరేపకపు విడుదల అధికమవుతుంది.
గళగ్రంథి స్రావములు థైరాక్సిన్ ( T4 ) , ట్రైఅయిడో థైరొనిన్( T3 ) లు రక్తములో థైరాక్సిన్ బైండింగ్ గ్లాబ్యులిన్ ( TBG ) అనే మాంసకృత్తుకి అంటుకొని రవాణా చేయబడుతాయి. కొంత భాగము మాత్రము స్వేచ్ఛగా ఉంటాయి.
గళగ్రంథిలో నాలుగణువులు అయొడిన్ గల థైరాక్సిన్ ( T4 ) నుంచి ఒక అణువు అయోడిన్ తొలగించబడి మూడణువుల ట్రైఅయుడో థైరొనిన్ ( T3 ) కొంత విడుదల అయినా 80 శాతపు థైరాక్సిన్ గళగ్రంథి నుంచి విడుదల అవుతుంది. కాలేయములో ( Liver ) యీ థైరాక్సిన్ మరల ట్రైఅయుడో థైరొనిన్ గా మార్పు జెందుతుంటుంది. కణజాలములో ట్రైఅయుడో థైరొనిన్ ( T3 ) కే చైతన్యత ఉంటుంది.
కణజాలములో జరిగే జీవప్రక్రియ ( Metabolism ) లన్నిటికీ గళగ్రంథి స్రావకము లవసరము. విశ్రాంత జీవప్రక్రియ ప్రమాణము ( Basal metabolic rate ) శరీరములో నున్న గళగ్రంథి ప్రభావమును సూచిస్తుంది. కణజాలముల వృద్ధికి, పరిపక్వతకు, పెరుగుదలకు గళగ్రంథి స్రవము లవసరము. వివిధ మాంసకృత్తుల సంకలనమునకు , పిండిపదార్థాలు, కొవ్వులు, మాంసకృత్తుల జీవన ప్రక్రియలకు, శరీరములో ఉష్ణజనితమునకు గళగ్రంథి స్రవము లవసరము.
గళగ్రంథి హీనత ( Hypothyroidism :
గళగ్రంథి శరీర అవసరాలకు తగినంత స్రవముల నందించ లేనప్పుడు గళగ్రంథి హీనత
( Hypothyroidism) సంభవిస్తుంది. హెచ్చుశాతము మందిలో యీ లోపము గళగ్రంథుల లోపమే. గళగ్రంథి తగినంతగా నిర్నాళ రసములను ( Hormones) ఉత్పత్తి చేయక పోవుట వలన యీ లోపము కలుగుతుంది. గళగ్రంథుల లోపమే ప్రాథమిక కారణమయితే దానిని ప్రాథమిక గళగ్రంథి హీనతగా
( Primary Hypothyroidism) పరిగణిస్తారు. శరీరములో అయొడిన్ లోపము వలన ప్రపంచములో హెచ్చుమందికీ గళగ్రంథి హీనత కలుగుతుంది. పాశ్చాత్య దేశాలలో ఉప్పునకు అయొడిన్ ను సంధానపఱచుట వలన ప్రజలలో అయొడిన్ లోపము అఱుదు.
( Hypothyroidism) సంభవిస్తుంది. హెచ్చుశాతము మందిలో యీ లోపము గళగ్రంథుల లోపమే. గళగ్రంథి తగినంతగా నిర్నాళ రసములను ( Hormones) ఉత్పత్తి చేయక పోవుట వలన యీ లోపము కలుగుతుంది. గళగ్రంథుల లోపమే ప్రాథమిక కారణమయితే దానిని ప్రాథమిక గళగ్రంథి హీనతగా
( Primary Hypothyroidism) పరిగణిస్తారు. శరీరములో అయొడిన్ లోపము వలన ప్రపంచములో హెచ్చుమందికీ గళగ్రంథి హీనత కలుగుతుంది. పాశ్చాత్య దేశాలలో ఉప్పునకు అయొడిన్ ను సంధానపఱచుట వలన ప్రజలలో అయొడిన్ లోపము అఱుదు.
హషిమోటో గళగ్రంథి తాపము ( Hashimoto ‘s thyroiditis ):
గళగ్రంథి స్వయం ప్రహరణ వ్యాధి ( Autoimmune thyroiditis ) వలన గళగ్రంథి ధ్వంసము చెంది గళగ్రంథి హీనత కలుగవచ్చు. ఈ వ్యాథిలో టి లింఫుకణములు ( T Lymphocytes ; ఇవి శరీర రక్షక వ్యవస్థలో ఒక భాగము. ) గ్రంథుల నాక్రమిస్తాయి. థైరోగ్లాబ్యులిన్ ( గళగ్రంథులలో ఉండే మాంసకృత్తి. దీని నుంచి గళగ్రంథి స్రావకములు ఉత్పత్తి అవుతాయి ) , థైరాయిడ్ పెరాక్సిడేజ్ ( Thyroid peroxidase ), గళగ్రంథిప్రేరేపక గ్రాహములకు ( TSH receptors ) ప్రతిరక్షకములు ( Antibodies) ఏర్పడి గ్రంథుల ధ్వంసమునకు దారితీస్తాయి. ఈ తాపక్రియ ( Inflammation) మందకోడిగా జరిగి క్రమేణా గళగ్రంథి హీనతను ( Hypothyroidism ) కలుగజేస్తుంది.
ప్రసవానంతరము కొంత మంది స్త్రీలలో తాత్కాలికముగా గళగ్రంథి హీనత పొడసూపవచ్చును. కొద్దిమందిలో యీ లోపము శాశ్వతము కావచ్చును.
చికిత్సా జనితము ( Iatrogenic ) : గళగ్రంథిని శస్త్రచికిత్సతో సంపూర్ణముగా గాని, పాక్షికముగా గాని తొలగించినా , రేడియోధార్మిక అయొడిన్ తో ధ్వంసము చేసినా గళగ్రంథిహీనత కలుగుతుంది.
అయొడిన్ సహితౌషధములు, లిథియం, ఆల్ఫా ఇంటెర్ఫెరాన్, ఇంటెర్లూకెన్ -2 , ఎమియోడరోన్ థాలిడోమైడు వంటి మందుల వలన గళగ్రంథి హీనత కలుగవచ్చును.
ద్వితీయ గళగ్రంథిహీనత ( Secondary Hypothyroidism) :
పీనస గ్రంథి వ్యాధి ( Pituitary disorders) , లేక ఘాతముల వలన గళగ్రంథి ప్రేరేపకపు ( TSH) ఉత్పత్తి జరుగక , ప్రేరేపక లోపము ( TSH deficiency) వలన , గళగ్రంథి స్రవముల ( T3,T4) ఉత్పత్తి తగ్గుతే గళగ్రంథి హీనత కలుగుతుంది.
తృతీయ గళగ్రంథి హీనత ( Tertiary hypothyroidism) :
మెదడులో హైపోథలమస్ ( Hypothalamus) గళగ్రంథి ప్రేరేపక విమోచిని ని
( Thyrotropin releasing hormone) విడుదల చేయజాలని స్థితులలో తృతీయ గళగ్రంథి హీనత కలుగుతుంది.
( Thyrotropin releasing hormone) విడుదల చేయజాలని స్థితులలో తృతీయ గళగ్రంథి హీనత కలుగుతుంది.
ద్వితీయ, తృతీయ గళగ్రంథి హీనములు అసాధారణము. వారిలో మెదడు, పీనస వ్యాధుల లక్షణాలు ప్రస్ఫుటముగా కనిపిస్తాయి.
గళగ్రంథి హీనత లక్షణములు ;
గళగ్రంథి హీనత ప్రస్ఫుటముగా నున్న వారిలో, అలసట, అతినిద్ర, శక్తిహీనత, చలికి తట్టుకోలేకపోవుట, మలబద్ధకము, జ్ఞాపకశక్తి క్షీణించుట, బొంగురుగొంతు, కండరాల సలుపు, కేశనష్టము, స్త్రీలలో రక్తప్రదరము పొడచూప వచ్చును. ఈ లక్షణములు క్రమేణా కలుగుతాయి. కొందఱిలో ఏ బాధలు ఉండవు.
వీరిలో పొడిచర్మము, ముఖములోను, కళ్ళచుట్టూ వాపు, హృదయ మందత ( Bradycardia) , స్నాయువుల ప్రతిక్రియలు మందగించుట ( Decreased tendon reflexes ) , గుంతపడని పొంగులు, కఱకు చర్మము, కనిపించ వచ్చును. కొంత బరువు హెచ్చుట జరిగినా విశేష స్థూలకాయమును గళగ్రంథి లోపము కలుగజేయదు. వీరిలో ఆకలి కొంత మందగించ వచ్చును. అయొడిన్ లోపించిన వారిలో గలగండము ( Goitre) కనిపిస్తుంది.
గుండెపై పొరలో నీరుపట్టుట( Pericardial effusion) , పుపుసవేష్టనములో నీరుచేరుట ( Pleural effusion) , మణికట్టు వాపు ( Carpal tunnel syndrome) వినికిడి తగ్గుట, అఱుదుగా కనిపించ వచ్చును. ఊపిరి మందగించుట వ్యాధితీవ్ర మయిన వారిలో పొడచూపవచ్చును. దీర్ఘకాలముగాను, తీవ్రముగా గళగ్రంథి హీనమున్న వారిలో మ్యూకోపాలీసాకరైడులు ( Mucopolysaccharides) చర్మము దిగువ చేరుకొని పొంగులు, వాపులు కనిపించవచ్చును. ఈ పొంగులున్న వారికి వేలుతో నొక్కితే గుంతలు పడవు. చర్మము దళసరిగా ఉన్న వీరి వ్యాధిని మిక్సిడీమా ( Myxedema) అని అంటారు.
వ్యాధి తీవ్రముగా ఉన్నవారిలో శరీరము చల్లబడి, గుండెవేగము బాగా తగ్గి, గందరగోళము, బుద్ధిమాంద్యత, అపస్మారకత ( Myxedema coma ), శ్వాసమందము కలిగి ప్రాణాపాయస్థితి
కూడా కలుగ వచ్చును. ఇది అసాధారణము.
కూడా కలుగ వచ్చును. ఇది అసాధారణము.
పుట్టిన పసికందులలో గళగ్రంథి హీనత ఉంటే అది క్రెటినిజం ( Cretinism) గా వర్ణిస్తారు. వారికి కండరముల బిగుతు సన్నగిల్లుట, పుఱ్ఱె వెనుక భాగము పూడుకొనక మెత్తదనము చాలా మాసము లుండవచ్చును., ( సాధారణముగా యీ మెత్తదనము రెండు , మూడు మాసములలో పూడుకుంటుంది.. ముందుభాగములో మెత్తదనము 18 మాసములలో పూడుకుంటుంది. ) బొంగురు గొంతుకతో ఏడవడము, శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉండుట, నాభిగోళకము ( Umbilical hernia ) , దళసరి నాలిక యీ శిశువులలో కలుగుతాయి. వ్యాధిని నిర్ణయించి, గళగ్రంథి రసాయనములతో వైద్యము సమకూర్చకపోతే పెరుగుదల మందగించుటే కాక బుద్ధివికాసము లోపించి వీరికి బుద్ధిమాంద్యత కలుగుతుంది.
వ్యాధి నిర్ణయము:
గళగ్రంథి హీనత ఉన్నవారిలో వ్యాధి లక్షణాలు క్రమేణా పోడచూపుతాయి. పరిమితముగా లోపమున్న వారిలో యే లక్షణములు కనిపించక పోవచ్చును. రక్త పరీక్షలు విరివిగా లభ్యమవుతున్న
ఈ దినములలో ప్రస్ఫుటమైన మిక్సిడీమా, లక్షణ సహితమైన గళగ్రంథి హీనతలను అఱుదుగా చూస్తాము.
ఈ దినములలో ప్రస్ఫుటమైన మిక్సిడీమా, లక్షణ సహితమైన గళగ్రంథి హీనతలను అఱుదుగా చూస్తాము.
రక్త పరీక్షలు :
గళగ్రంథి హీనము ఉన్నవారిలో కొలెస్టరాలు, ట్రైగ్లిసరైడులు, క్రెయటినిన్ కైనేజ్ ల పరిమాణము లెక్కువ ఉండవచ్చును. వీరిలో సోడియం ప్రమాణములు తక్కువ అవవచ్చును.రక్తములో గళగ్రంథి ప్రేరేపకపు విలువ ( TSH ) లెక్కువగా ఉంటాయి. గళగ్రంథి ప్రేరేపకపు విలువలు సాధారణ ప్రమాణములో ఉండి, థైరాక్సిన్ ( T4 )విలువలు తక్కువగా ఉండని పక్షములో గళగ్రంథి హీనత లేదని నిర్ధారణ చెయ్యవచ్చును.
గళగ్రంథిప్రేరేపకపు ( TSH ) విలువ 20 మైక్రోయూనిట్లు/ మి.లీ. రుకి మించి ఉంటే వ్యాధి లక్షణాలు లేక పోయినా గళగ్రంథి హీనము ఉన్నదని నిర్ధారణ చెయ్య వచ్చును.
గళగ్రంథి హీనము లేక యితర వ్యాధులున్నవారిలో గళగ్రంథిప్రేరేపకపు విలువలు సాధారణ పరిమితి నతిక్రమిమించినా 20 మైక్రో యూనిట్ల లోనే ఉంటుంది.
గళగ్రంథి ప్రేరేపకపు ( TSH ) విలువ ఎక్కువయినా 20 మైక్రో యూనిట్ల లోనే ఉండి థైరాక్సిన్ విలువ తక్కువగా ఉంటే దానిని విదిత గళగ్రంథి హీనతగా ( Overt hypothyroidism) పరిగణించి వారికి తగు పరిమాణములో లీవోథైరాక్సిన్ సమకూర్చాలి
గళగ్రంథి ప్రేరేపకపు ( TSH ) విలువలు 5- 10 ( కొందరు వైద్యులు 5 దాటినప్పుడు, కొందరు 10 దాటినప్పుడు ) ప్లాస్మా థైరాక్సిన్ ( T4 ) విలువలు సాధారణ పరిమితులలో ఉన్నప్పుడు దానిని అగోచర గళగ్రంథి హీనతగా ( Subclinical hypothyroidism) పరిగణిస్తారు. వీరికి వైద్యము అవసరము లేదు, కాని సంవత్సరమున కొక పర్యాయము రక్తపరీక్షలు చేసి గమనిస్తూ థైరాక్సిన్
( T4 )విలువలు తగ్గినా గళగ్రంథి ప్రేరేపకపు విలువలు పెరిగినా లీవోథైరాక్సిన్ వైద్యము సమకూర్చవచ్చును. అగోచర గళగ్రంథిహీనత ఉన్నవారిలో సంవత్సరమునకు 2.5% మందిలో
యీ హీనత ప్రస్ఫుటమవుతుంటుంది.
( T4 )విలువలు తగ్గినా గళగ్రంథి ప్రేరేపకపు విలువలు పెరిగినా లీవోథైరాక్సిన్ వైద్యము సమకూర్చవచ్చును. అగోచర గళగ్రంథిహీనత ఉన్నవారిలో సంవత్సరమునకు 2.5% మందిలో
యీ హీనత ప్రస్ఫుటమవుతుంటుంది.
గర్భిణీస్త్రీలలో గళగ్రంథి ప్రేరేపకపు విలువలు 10 మైక్రోయూనిట్లు దాటితే అది విదిత గళగ్రంథి హీనముగా పరిగణించి వైద్యమును చెయ్యాలి. ఆ విధముగా శిశువులలో వ్యాధి నరికట్టవచ్చును.
అప్రథాన గళగ్రంథి ( Secondary hypothyroidism) హీనమున్న వారిలో గళగ్రంథి ప్రేరేపకపు
( TSH ) విలువలు హెచ్చవవు . కావున వీరిలో గళగ్రంథి స్రవముల విలువలు ( థైరాక్సిన్. T4 ) స్వేచ్ఛాపు థైరాక్సిన్ ( Free T4 ) విలువలు తక్కువగా ఉంటే గళగ్రంథి హీనతను ధ్రువీకరించ వచ్చును.
( TSH ) విలువలు హెచ్చవవు . కావున వీరిలో గళగ్రంథి స్రవముల విలువలు ( థైరాక్సిన్. T4 ) స్వేచ్ఛాపు థైరాక్సిన్ ( Free T4 ) విలువలు తక్కువగా ఉంటే గళగ్రంథి హీనతను ధ్రువీకరించ వచ్చును.
గళగ్రంథి ప్రేరేపక గ్రాహకములకు ( TSH Receptors ), థైరోగ్లాబ్యులిన్ కు, థైరాయిడ్ పెరాక్సిడేజు కు ప్రతిరక్షముల ( Antibodies) పరీక్షతో స్వయంప్రహరణ గళగ్రంథ తాపములను ( Autoimmune thyroiditis ) ధ్రువీకరించ వచ్చును. కాని చికిత్సాపరముగా యీ పరీక్షల వలన చేకూరే ప్రయోజనము తక్కువ.
గళగ్రంథిలో గడ్డలు, పెరుగుదలలు ఉంటే శ్రవణాతీతధ్వని చిత్రీకరణము ( Ultrasonography) పరీక్షలు , కణపరీక్షలు అవసరమవ వచ్చును. పెరుగుదలలు లేకపోతే ఆ పరీక్షలు అనవసరము.
పీనస గ్రంథి, హైపోథలముస్, మెదడు వ్యాధుల లక్షణాలున్న యెడల అయస్కాంత ప్రతినాద చిత్రీకరణలు ( Magnetic resonance imaging ) తోడ్పడుతాయి.
చికిత్స :
లీవోథైరాక్సిన్ ( Levothyroxine ) కృత్రిమముగా సంధింపబడుతున్నది. తక్కువ ధరకు అందుబాటులో కూడా ఉన్నది. గళగ్రంథి హీనత ఏ కారణము వలన కలిగినా లీవోథైరాక్సినే చికిత్సకు వాడుతారు. తగిన మోతాదును వైద్యులు నిర్ణయిస్తారు. యవ్వన వయస్కులకు తగిన మోతాదు నొక్కసారే మొదలపెట్ట వచ్చును. వృద్ధులలోను, హృద్రోగులలోను. తక్కువ మోతాదుతో ( దినమునకు 25 మైక్రోగ్రాములతో ) మొదలుపెట్టి ప్రతి మూడు, నాలుగు వారములకు మోతాదును క్రమేణా పెంచుతు అవసరమైన మోతాదుకు చేర్చాలి.
లీవోథైరాక్సిన్ని దినమున కొక్కసారి యిస్తే సరిపోతుంది. ఖాళీ కడుపుతో యీ మందును సేవించి మరి యే యితర మందులు మరొక రెండు గంటల వరకు తీసుకొన రాదు. అయనము, కాల్సియం, అల్యూమినియపు మృదుక్షారకములు, సుక్రాల్ఫేట్, కొలిస్టెరమిన్ వంటి మందులు లీవోథైరాక్సిన్ గ్రహణమునకు అంతరాయము కలిగిస్తాయి.
గళగ్రంథి ప్రేరేపకపు ( TSH ) పరీక్షను ఆరు వారముల కొకసారి చేస్తూ మందు మోతాదును సరిదిద్ద వచ్చును. లీవోథైరాక్సిన్ మోతాదు స్థిర పడ్డాక, సంవత్సరమున కొకసారి పరీక్ష సలుపుతే చాలు.
( ఉపయుక్త మనుకుంటే స్వేచ్ఛగా పంచుకొనండి )
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
మస్తిష్క రక్తనాళ విఘాతములు ( Cerebro Vascular Accidents )
( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో ) డా. గన్నవరపు నరసింహమూర్తి మెదడు నిర్మాణము ( Anatomy of Brain ) : మన శరీరములో వివిధావయవాలు న...

-
పాండురోగము (రక్తహీనము : Anaemia ) - డా. గన్నవరపు నరసింహమూర్తి జంతుజాలములోను , పక్షులలోను , జలచరములలోను జీవన వ్యాపారమునకు రక్తప్రసరణము ...
-
జీర్ణ వ్రణములు ( Peptic ulcers ) డా. గన్నవరపు నరసింహమూర్తి మనము భుజించే ఆహారము అన్ననాళము ( Esophagus ) ద్వారా జీర్ణాశయము లోనికి చేర...
-
( తెలుగుతల్లి కెనడా లో ప్రచురించబడిన వ్యాసము ) డా. గన్నవరపు నరసింహమూర్తి శరీరానికి కలిగే రుగ్మతలలో కొత్త పెరుగుదలలకు ( Growths )...